బాలీవుడ్

Disha Patani: హీరోతో బ్రేకప్ రూమర్స్.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Disha Patani: టైగర్ ష్రాఫ్‌, దిశా పటానీ.. వీరిద్దరూ ఆరేళ్ల నుండి రిలేషన్‌లో ఉన్నారు.

Disha Patani: హీరోతో బ్రేకప్ రూమర్స్.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
X

Disha Patani: సినీ పరిశ్రమలో కొన్ని ప్రేమ వ్యవహారాలు మాత్రమే పెళ్లి వరకు వెళతాయి. చాలావరకు మాత్రం బ్రేకప్‌తోనే ముగిసిపోతాయి. అలాగే బాలీవుడ్‌లో ఇటీవల ఓ హీరో, హీరోయిన్ బ్రేకప్ అయిపోయారంటూ ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా ఈ రూమర్స్ నిజమేనేమో అనిపించేలాగా వీరిద్దరూ కలిసి కనిపించడం కూడా మానేశారు. అయితే తాజాగా ఆ హీరోయిన్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే ఇన్‌డైరెక్ట్‌గా ఏదో చెప్తోంది అన్నట్టే అనిపిస్తోంది.

టైగర్ ష్రాఫ్‌, దిశా పటానీ.. వీరిద్దరూ ఆరేళ్ల నుండి రిలేషన్‌లో ఉన్నారు. అంతే కాకుండా ఈ ఆరేళ్లలో కొన్నిసార్లు వీరి కెరీర్‌ను పక్కన పెట్టి మరీ ప్రేమించుకున్నారు. కానీ గత కొన్నిరోజులుగా వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయిందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. టైగర్.. దిశాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడని, అందుకే వీరిద్దరూ విడిపోయారని వార్తలు వస్తున్నాయి.

బ్రేకప్ రూమర్స్ వైరల్ అయిన తర్వాత కూడా దిశా పటానీ.. టైగర్ పోస్టులకు కామెంట్స్ పెట్టింది. కానీ దానికి టైగర్ ఏ విధంగానూ స్పందించలేదు. అయితే ఇంతలోనే దిశా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఇప్పటివరకు మీకు ఎవరూ చెప్పలేదేమో. అన్నీ ఓకే అయిపోతాయి' అంటూ స్టోరీ షేర్ చేసింది దిశా. ఇంతకీ దీనికి అర్థమేంటి, దిశా ఈ బ్రేకప్ నుండి బయటికి రావాలి అనుకుంటుందా అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.Next Story

RELATED STORIES