Dream Girl 2: డ్రీమ్ గర్ల్ 2 రికార్డు కలెక్షన్లు

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana), అనన్య పాండే( Ananya Panday) జోడీగా.. దర్శకుడు రాజ్ శాండిల్య తెరకెక్కించిన వినోద ప్రధాన చిత్రం డ్రీమ్‌గర్ల్ 2(Dream Girl 2). ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అమ్మాయి వేషధారణతో ఆయుష్మాన్ చేసిన హంగామా ప్రేక్షకులను థియేటర్ల వైపునకు నడిపిస్తోంది.
డ్రీమ్ గర్ల్ మూవీని ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, శోభాకపూర్ సొంత బ్యానర్‌పై భారీగా నిర్మించారు. ఈ సినిమాను సుమారు 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దర్శకుడు రాజ్ శాండిల్య తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ క్రేజ్ రావడం, ఆయుష్మాన్ ఖురానా నిర్వహించిన ప్రచారానికి మంచి స్పందన రావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమాకు భారీ క్రేజ్ రావడంతో దాదాపు 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆయుష్మాన్ కెరీర్‌లో అత్యధికంగా స్క్రీన్లలో రిలీజైన సినిమా ఇదే కావడం గమనార్హం.
ఆయుష్మాన్ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా డ్రీమ్ గర్ల్ 2 రికార్డు సృష్టించింది. ఈ సినిమా తొలి రోజు( Box Office Collection Day 1) ఇండియా వైడ్ దాదాపు 10 కోట్ల రూపాయలు( earns ₹9.70 crore) వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 12 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి రోజు కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌లో 15 శాతం రెవెన్యూను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. గదర్ 2, జైలర్('Gadar 2' and 'Jailer) వంటి హిట్ సినిమాల దాడిని తట్టుకుంటూ డ్రీమ్‌గర్ల్ 2 భారీ ఓపెనింగ్స్ సాధించడం విశేషం.
సన్నీ డియోల్ నటించిన గదర్ 2 మొదటి రోజు మొత్తం సుమారు రూ. 35 కోట్లు వసూలు చేయగా, రజనీకాంత్ జైలర్ దాదాపు రూ. 45 కోట్ల కలెక్షన్లు సాధించింది. గదర్ 2 2023లో బాలీవుడ్‌లో అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
2019లో డ్రీమ్ గర్ల్‌తో విజయాన్ని అందుకున్న రాజ్ శాండిల్య 2023లో డ్రీమ్ గర్ల్ 2తో మరోసారి హిట్ కొట్టాడు. పూజా, కరమ్ పాత్రల్లో ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండేతో ఒదిగిపోయారు. సినిమాలో పరేష్ రావల్, విజయ్ రాజ్, అన్నూ కపూర్, అభిషేక్ బెనర్జీ, అస్రానీ, రాజ్‌పాల్ యాదవ్, మంజోత్ సింగ్, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com