Entertainment: మ్యాప్ పై కాలేసి తప్పు చేశాడు
విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకుని నెటిజెన్ల ట్రోలింగ్ కు గురవుతున్నాడు. అక్కీ భారత పటాన్ని కాలుతో తొక్కాడని జాతీయవాదులు నానా రభసా చేసేస్తున్నారు. ఇంతకూ మ్యాటర్ ఏమిటంటే నార్త్ అమెరికా టూర్ లో భాగంగా ప్రమోషనల్ వీడియో చేసిన అక్షయ్ బ్లూ మ్యాట్ లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నట్లు ఓ వీడియో చేశాడు. తీరా దానికి గ్రాఫిక్స్ యాడ్ చేయడంతో సరిగ్గా అక్షయ్ కాలు కిందకు భారత పటం వచ్చింది. దేశభక్తుడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే అక్షయ్ కుమార్ ఇంత ఈ విషయాన్ని ఎలా విస్మరించగలడు అని నెటిజెన్లు అతడిని తూర్పారబెడుతున్నారు. ఈ వీడియో అక్షయ్ తో పాటూ దిశా పటానీ, మౌనీ రాయ్, నోరా ఫతేహీ, సోనమ్ బాజ్వా కూడా పాల్గొన్నారు. అయితే అమ్మాయిలు భారత పటాన్ని తప్పించుకున్నప్పటికీ, ఇతర దేశ పటాలపై వారు కూడా నడిచినట్లే. అయినప్పటికీ ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నారు. ఇక నార్త్ అమెరికా టూర్ ప్రచార వీడియోను అక్షయ్ స్వయంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై అక్షయ్ ఏమంటాడో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com