Entertainment: ఆలియా అంతా క్షేమమేనా....

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ మధ్య తరచూ వార్తలకు ఎక్కుతూనే ఉంది. తాజాగా అమ్మడి లుక్స్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. తల్లైన కొద్ది రోజులకే నాజూకుగా దర్శనమిచ్చిన ఆలియా ఫిట్నెస్ లవర్స్ మది దోచుకుంది. అయితే క్రమంగా ఆలియా మరింత నాజూకుగా మారిపోతోంది. తాజాగా మీడియాకు దర్శనమిచ్చిన ఫొటోల్లో అమ్మడి చిక్కి శల్యమైనట్లు కనిపించడం అభిమానులను కలవరపెడుతోందనే చెప్పాలి. ఈ మధ్య సుప్రసిద్ధ దర్శకుడు సంజయ్ లీలా పుట్టిన రోజు వేడుకలకు ఆలియా హాజరైంది. తెల్లటి సూట్ లో మెరిసిపోతున్న ముద్దుగుమ్మల ో ఏదో మిస్ అవుతోన్న ఫీలింగ్ అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, నెటిజెన్లు అమ్మడి తాజా రూపంపై తలోరకంగా స్పందిస్తున్నారు. ఆలియా మరీ నాజూగ్గా తయారవుతోందని కొందరు కామెంట్ చేస్తుంటే, మరి కొందరు అమ్మడు కూడా పెదాలకు సర్జరీ చేయించుకుందని అంటున్నారు. మరి ఇందులో ఎవరి వాదన నిజమే కాలమే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com