Entertainment: రంగుతక్కువని మేకప్ ఎక్కువ వేశారు....

X
By - Chitralekha |29 March 2023 12:21 PM IST
తన రంగుపై బాలీవుడ్ లో ఎదుర్కొన్న వివక్షపై స్పందించిన ప్రియాంకా చోప్రా
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ, ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు లాగే జనాలు ఉంటే ఇంట గెలవడం ఎవరికి సాధ్యమంటారు. అలాంటి పరిస్థితుల్లోనూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా. అడుగడుగునా తన ఎదుగుదలకు కొందరు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ అన్నింటినీ తట్టుకుని నిలబడింది. కానీ, ఇక్కడే ఉండిపోతే జీవితాంతం పోరాటం చేస్తూనే ఉండాలని భావించిన పిగ్గీ చాప్స్ హాలీవుడ్ కు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది. అక్కడే స్థిర నివాశం ఏర్పాటు చేసుకుంది. ఇటీవలే బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ప్రియాంకా చోప్రా, ఇండస్ట్రీలో తన రంగుపై సాగిన చర్చను కూడా ప్రస్తావించింది. కొన్ని సినిమాల్లో తనని తెల్లగా చూపించేందుకు మేకప్ ఎక్కువ వేశారని, లైటింగ్ జిమ్మిక్కులతో తనని అత్యంత అందంగా చూపించే ప్రయత్నం చేశారని వాపోయింది. తన రంగును కప్పి పుచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. ఏమైనా ప్రియాంకా చెబుతున్న అంశాలు ఎవరికీ కొత్తకావు, అలాని వాటికి ఫుల్ స్టాప్ పడేది ఎన్నడు అంటే సరైన సమాధానమూ దొరకదు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com