Entertainment: బంగారంలా మెరిసిపోతున్న హార్దిక్ భార్యామణి

Entertainment: బంగారంలా మెరిసిపోతున్న హార్దిక్  భార్యామణి
వివాహానంతరం గ్లామర్ డోస్ పెంచేసిన నటాషా; తాజాగా అబు జానీ షోకు హాజరైన నటాషా....

క్రికెటర్ హార్దిక్ పాండ్యా- నటాషా ఇటీవలే అంగరంగ వైభవంగా వేద వచనాల మధ్య మళ్లీ పెళ్లాడేసి అందరినీ మురిపించేశారు. అయితే మొదటిసారి పెళ్లవ్వక ముందే నటాషా గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది. నటిగా, మోడల్ గా రాణిస్తూ ఉండగానే హార్దిక్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమకాస్త పెళ్లికి దారితీయడం, ఇద్దరూ ఓ అందమైన బుజ్జాయికి జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. ఇటీవలే మరోసారి పెళ్లి ముచ్చట కానిచ్చిన నటషా రకరకాల బ్రైైడల్ వేర్ లో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఇక ఈ పెళ్లి ముచ్చట కాస్త సద్దుమణిగేసరికి అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ అప్ డేట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. అంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఇండస్ట్రీలోనూ యాక్టివ్ గా మారింది. ఇటీవలే అబు జానీ, సందీప్ కోస్లా ఫ్యాషన్ షోకు హాజరైన నటాషా బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయిందనే చెప్పాలి. ఫ్యాషన్ షో శాంతం అమ్మడి హడావిడే అనడంలో సందేహమేలేదు. మరి ఇదే ఊపులో నటాషా సిల్వర్ స్క్రీన్ పైనా రఫ్పాడించేస్తుందేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story