Entertainment: సారీ చెప్పు.. లేదంటే చావే దిక్కు... సల్మాన్ కు లారెన్స్ వార్నింగ్

Entertainment: సారీ చెప్పు.. లేదంటే చావే దిక్కు... సల్మాన్ కు లారెన్స్ వార్నింగ్
మరోసారి సల్మాన్ ఖాన్ కు బహిరంగ హెచ్చరిక; క్షమాపణలు చెబితేనే క్షమిస్తానంటోన్న లారెన్స్ బిష్ణోయ్..
కృష్ణ జింకను వేటాడిన కేసులో కోర్టు నుంచి సల్మాన్ ఖాన్ కు ఊరట లభించినప్పటికీ ఆ పాపం మాత్రం అతడిని ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణ జింకను కులదైవంగా పూజించే బిష్ణయ్ తెగ ప్రజలు మాత్రం సల్మాన్ పై అగ్గిమీద గుగ్గులం అవుతూనే ఉన్నారు. తాజాగా గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ పై హత్యా యత్నం చేసి విఫలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న లారెన్స్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సూపర్ స్టార్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిని జోధ్ పూర్ లోనే చంపుతానని బెదిరించాడు. అయితే సల్మాన్ ఓ మెట్టు దిగి తమ కుల దైవం దేవాలయాని దర్శించుకుని తమ వారికి క్షమాపణలు చెబితే అతడిని క్షమిస్తానని స్పష్టం చేశాడు. మరి దీనిపై సల్లూమియా ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story