Entertainment: ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చేస్తోందట...
బట్టలేసుకునేందుకు పెద్దగా ఇష్టపడని సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ సడన్ గా ట్రాక్ మర్చేసింది. కాదేది కవితకు అనర్హం అన్నట్లు, గోనె సంచెలు, మానసిన గుడ్డులు, బ్యాడ్మింటన్ నెట్టులు... చేతికి ఏది దాంతోనే అరకొర దుస్తులను తానే డిజైన్ చేసుకునే ఉర్ఫీ... ఇదే రీతిన మస్త్ పాపులారిటీని మూటగట్టుకుంది. క్రమంగా ఓ సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఉన్నట్లుండి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు... అమ్మడు తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి పశ్చాత్తాప పడుతోందట. తన దుస్తులు సంప్రదాయవాదుల మనోభావాలను దెబ్బతీస్తున్నందున ఇకపై సమూలంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ను ప్రక్షాళన చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే అమ్మడి స్టేట్మెంట్ లో ఏదో మెలిక ఉండే ఉంటుందని జనాలు గట్టిగానే నమ్ముతున్నారు. మామూలుగానే సెటైర్లు వేయడం అమ్మడికి బాగా అలవాటు. అందులోనూ ఏప్రిల్ 1 ఫుల్స్ డే ను పురస్కరించుకుని ఉర్ఫీ పరాచకాలు ఆడుతోందనేవారూ లేకపోలేదు. మరి అమ్మడి ప్రకటనలో ఎంత నిమజముందో తెలియాలంటే... కాస్త ఓపిక పట్టాలి మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com