Esha Gupta: ఇండస్ట్రీలో ఉండాలంటే అలా చేయమని సలహా ఇచ్చారు: ఈషా

Esha Gupta: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే ముందు అందంగా ఉండాలి అనుకునేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కొందరు హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ చేయకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ఉన్నా కూడా అందంగా ఉంటేనే అవకాశాలు అనేవారు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో తాను కూడా ఇలాంటివి ఎదుర్కున్నానంటూ బయటిపెట్టింది ఈషా గుప్తా.
పలు యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా గుప్తా. ఆ తర్వాత సౌత్‌లో కూడా ఒకట్రెండు చిత్రాలలో మెరిసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ'లో స్పెషల్ సాంగ్‌లో మెరిసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను విన్న సలహాలు గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో తన ముక్కు బాలేదంటూ కామెంట్ చేసేవారిని బయటపెట్టింది ఈషా. అంతే కాకుండా చర్మం మెరిసిపోవడానికి ఇంజెక్షన్ తీసుకోమని సలహా ఇచ్చారట. అయితే ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ.9000 అని తెలియడంతో వెనక్కి తగ్గిందట ఈషా. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం ఆ ఇంజెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడతారు అంటోంది.
సినిమాల్లోకి రావాలంటే అందంగా కనిపించాలని నటీనటులపై చాలా ఒత్తిడి ఉంటుందని, అందుకే తను తన కూతురిని హీరోయిన్‌గా చేయనని అంటోంది ఈషా. చిన్న వయసు నుండే అందంగా ఉండాలన్న ఒత్తిడి తన కూతురిపై పడడం ఇష్టం లేదంటోంది. అంతే కాకుండా తన కూతురు ఓ గొప్ప క్రీడాకారిణి అయితే చూడాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టింది ఈషా గుప్తా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com