అనారోగ్యంతో హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మృతి!

అనారోగ్యంతో హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మృతి!
హిందీ బిగ్‌బాస్‌ షో 10వ సీజన్‌ పోటీదారుడు స్వామి ఓం కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.

హిందీ బిగ్‌బాస్‌ షో 10వ సీజన్‌ పోటీదారుడు స్వామి ఓం కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అతడి కుమారుడు అర్జున్‌ జైన్‌, స్నేహితుడు ముఖేశ్‌ జైన్‌ తెలిపారు. గత మూడు నెలల క్రితం స్వామి ఓం కరోనా బారిన పడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌లో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా 2017లో జరిగిన బిగ్‌బాస్‌ 10 షోలో అయన వివాదాస్పదమయ్యారు. దీనితో ఆయనను హోస్ట్‌గా ఉన్న సల్మాన్‌ఖాన్‌ బహిష్కించారు. కాగా 2008లో ఓ కేసులో అయనను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story