Gouri Khan: గౌరీ చెత్తబుట్ట చాలా కాస్ట్లీ గూరూ...

Gouri Khan: గౌరీ చెత్తబుట్ట చాలా కాస్ట్లీ గూరూ...
గౌరీఖాన్ వెబ్ సైట్లతో చెత్తబుట్ట దగ్గర నుంచి అన్ని ఫిరమే అంటోన్న నెటిజెన్లు; అడ్డంగా దోచేస్తున్నారంటూ ధ్వజం
బాలీవుడ్ బాద్షా భార్యామణి గౌరీఖాన్ తనకున్న ఇమేజ్ తో చాలా కాలం క్రితమే వ్యాపారవేత్తగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్యాతో కలసి ఓ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను ప్రారంభించింది. కొన్నేళ్లుగా ఈ వ్యాపారాన్ని సక్సెస్ ఫుల్ గా నడుపుతోందనే చెప్పాలి. అయితే ఉన్నట్లుండి గౌరీ పై నెటిజెన్లు భారీ ట్రోలింగ్ కు దిగారు. గౌరీ ఖాన్ డిజైన్స్ పేరిట ఉన్న వెబ్ సైట్ ల ో పలు వస్తువులు భారీ ధరలు పలుకుతుండటంపై పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. కేవలం ఓ చెత్త బుట్ట ఖరీదే ఏకంగా రూ. 15,000 ఉండటం ఈ ట్రోలింగ్ కు కారణమవుతోంది. ఇక గవ్వలతో తయారు చేసిన ఓ ల్యాంప్ షేడ్ ఏకంగా రూ. 1,59,300 ఉండటం మధ్యతరగతి జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ట్రోలింగ్ రూపంలో తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఆర్మీ క్యాంటీన్ లో రూ.100కు ఇంతకన్నా మంచి చెత్తబుట్ట దొరుకుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఏమైనా లగ్జరీ కోసం పరితపించేవారికి ఇదేమీ పెద్ద లెక్కకాకపోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story