Naga Chaitanya: 'లాల్ సింగ్ చడ్డా' కోసం నాగచైతన్య రెమ్యునరేషన్ ఎంతంటే..?

Naga Chaitanya: లాల్ సింగ్ చడ్డా కోసం నాగచైతన్య రెమ్యునరేషన్ ఎంతంటే..?
Naga Chaitanya: 'ఫారెస్ట్ గంప్' అనే ప్రముఖ హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది 'లాల్ సింగ్ చడ్డా'.

Naga Chaitanya: మామూలుగా ఓ ఇండస్ట్రీ నుండి హీరోను మరో ఇండస్ట్రీకి తీసుకెళ్లినప్పుడు మేకర్స్.. వారికి ఎంత నచ్చితే అంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడరు. అలాగే అక్కినేని హీరో నాగచైతన్య కూడా అమీర్ ఖాన్‌లాంటి బాలీవుడ్ స్టార్ సినిమా 'లాల్ సింగ్ చడ్డా' తో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ మూవీలో హీరోతో కలిసి ట్రావెల్ చేసే ఓ ముఖ్యమైన పాత్రలో తాను కనిపించాడు. అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది.

'ఫారెస్ట్ గంప్' అనే ప్రముఖ హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది 'లాల్ సింగ్ చడ్డా'. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అమీర్ ఖాన్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తెలిపాడు. అందుకే ఈ చిత్రం విడుదలను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. 'లాల్ సింగ్ చడ్డా' ఆగస్ట్ 11న థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాగచైతన్య.

'లాల్ సింగ్ చడ్డా'లో బాలరాజు పాత్రలో అలరించనున్నాడు నాగచైత్య. ఇక హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చైతూ చాలా సమయాన్నే కేటాయిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ కనిపించేది కాసేపే అయినా దీనికోసం రూ.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. మూవీ మేకర్స్ కూడా తాను అడిగినంత పారితోషికం అందజేసినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story