ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్ము రేపుతున్న కోహ్లీ, ప్రియాంక చోప్రా.. ఒక్కో పోస్ట్‌కి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. గ్రౌండ్‌లో బ్యాట్‌తో దుమ్మురేపే కోహ్లి.. సంపాదనలోనూ అదే ఫాలో అవుతున్నాడు. యాడ్స్, బిజినెస్, ప్రయోషన్స్‌తో కోట్లలో సంపాదిస్తున్నాడు. ఇక సోసల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ భారీగా ఫాలోవర్స్ పెంచుకున్న కోహ్లి.. అక్కడ కూడా ఆదాయం బాగానే లాగేస్తున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సంపాదనలో ప్రపంచంలోనే టాప్ 20లోకి కోహ్లీ చేరుకున్నాడు. కొహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేయాలంటే దాదాపు 5 కోట్ల రూపాలయకు పైగా తీసుకుంటాడట.
సాధారణంగా సెలబ్రెటీలకు ఆదాయ మార్గాలు అనేకముంటాయి. యాడ్స్, బిజినెస్, ప్రయోషన్స్‌తో కోట్లలో డబ్బులు కూడగట్టుకుంటారు. సెలబ్రిటీల ఫాలోవర్స్‌ను బట్టి వాళ్ల స్టేటస్ అంతకంతకూ పెరుగుతుంటుంది. అయితే సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా వేదికలపై చేసే పోస్ట్‌లతో కూడా భారీగా సంపాదిస్తున్నారు.
హోపర్ హెచ్‌క్యూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తున్న సెలబ్రిటీల జాబితాని ప్రకటించింది. ఇందులో రొనాల్డో నెంబర్ 1 స్థానంలో నిలవగా.. భారత్ నుంచి టాప్-20లో విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది. ఇక ఓవరాల్‌గా మొత్తం 395 మందితో ఈ జాబితాని హోపర్ హెచ్‌క్యూ ప్రకటించగా.. ఈ లిస్ట్‌లో కోహ్లీ పాటు ప్రియాంక చోప్రాకి మాత్రమే చోటు దక్కింది. ప్రియాంక చోప్రా ఒక్కో పోస్ట్‌కి దాదాపు 3 కోట్లు ఆర్జిస్తోంది. గత ఏడాది టాప్-20లో ఉన్న ప్రియాంక చోప్రా.. ఈ ఏడాది 27వ స్థానానికి పడిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com