Hina Khan: 'అలాంటి వారికోసమే సరిహద్దులు పెట్టాలి'.. నటి ట్వీట్ వెనుక అర్థమేంటి?

Hina Khan: అలాంటి వారికోసమే సరిహద్దులు పెట్టాలి.. నటి ట్వీట్ వెనుక అర్థమేంటి?
Hina Khan: తాజాగా హీనా ఖాన్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లలో సందేహాన్ని రేకెత్తిస్తోంది.

Hina Khan: చాలావరకు సెలబ్రిటీలు తమ భావాలను, అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. సినీ సెలబ్రిటీలు అయితే కేవలం తమ సినిమా అప్డేట్స్ కోసమే కాదు.. పర్సనల్ లైఫ్ గురించి పంచుకోవడానికి కూడా సోషల్ మీడియా సాయం తీసుకుంటారు. అయితే తాజాగా ఓ నటి.. సోషల్ మీడియా వేదికగా ఎవరికో గట్టి వార్నింగే ఇచ్చింది.


హీనా ఖాన్.. ఎన్నో సంవత్సరాలు బుల్లితెరపై నటిగా తన సత్తా చాటిన తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్. ఎన్నో రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది హీనా ఖాన్. ఇక ఓటీటీ అనేది పాపులర్ అయిన తర్వాత పలు వెబ్ సిరీస్‌లలో, వెబ్ సిరీస్‌లలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది హీనా ఖాన్. తాజాగా ఈ నటి చేసిన ట్వీట్ నెటిజన్లలో సందేహాన్ని రేకెత్తిస్తోంది.


'కొంచెం కూడా సున్నితత్వం లేని, సభ్యత లేని, మర్యాద లేని మనుషులు ఎన్నో విధాలుగా సరిహద్దులు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేస్తుంటారు. వారు నీ పనిలో కలగజేసుకొని, నువ్వు బాధపడేలా ఏమైనా అంటారు. అందుకే సరిహద్దులు పెట్టుకొని, లైన్ క్రాస్ చేసేవారిని దూరం పెట్టాలి. సరిహద్దులు అనేవి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి' అంటూ ట్వీట్ చేసింది హీనా ఖాన్. ఉన్నట్టుండి హీనా ఖాన్ చేసిన ఈ ట్వీట్‌కు అర్థమేంటి, అసలు ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడింది అని తన అభిమానులు చర్చించుకుంటున్నారు.



Tags

Next Story