Hrithik : ఫామ్ లోకి వచ్చేసిన గ్రీక్ గాడ్; ఇక రచ్చరచ్చే మరి..

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కొంతకాలంగా ఫామ్ కోల్పోయాడనే చెప్పాలి. ఈ మధ్య మరీ లో ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేస్తున్న దుగ్గూ భాయ్ తాజాగా ఒక్క ఝలక్ ఇచ్చాడు. ఇంకే ముంది అదికాస్తా వైరల్ గా మారింది.
హృతిక్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 8ప్యాక్ యాబ్స్‌తో బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ క్యాప్ బ్లాక్ ట్రూజర్‌లో ఉన్న దుగ్గు... షర్ట్‌ను కాస్త పైకెత్తేసరికి ఇన్స్టాగ్రామ్ పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. 'Alright. Let's go. #2023.' అనే క్యాప్షన్ ను జోడించగా ఈ పోస్ట్ పై అభిమానులు, తోటి హీరోలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నటుడు వరుణ్ ధవాన్ 'సరే మరి' అంటూ కామెంట్ చేయగా ఓ అభిమాని మరో అడుగు ముందుకేసి 'సర్ నాకూ ఓ రెండు ఇవ్వండి' అంటూ చమత్కరించాడు. ఇక మరో ఫ్యాన్ అయితే 'సోమవారం నుంచి డైట్ మొదలుపెట్టేస్తానంటూ' శపథం చేశాడు. మొత్తానికి హృతిక్ ఒక్క పోస్ట్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి.
ఇక ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే 'ఫైటర్' సినిమా 2024లో విడుదల కానుంది, 'పఠాన్' సినిమాతో అందరి దృష్టిని తనవైపే మళ్లించుకున్న దీపికా పదుకొనే ఈ సినిమాలో హృతిక్ సరసన మెరవనున్నది. అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన రోల్ చేయనున్నాడు. కాగా ఇటీవలే హృతిక్ నటించిన విక్రమ్ వేదా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com