Ileana: ఇలియానా ప్రేమాయణం.. స్టార్ హీరోయిన్ సోదరుడితో..

Ileana: టాలీవుడ్‌లో సైజ్ జీరో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఇలియానా. తన గ్లామర్‌తో, హావభావాలతో ఎంతోమందికి క్రష్‌గా మారిపోయింది. స్టార్ హీరోలతో మాత్రమే కాదు పలువురు యంగ్ హీరోలతో కూడా కలిసి నటించింది. దాదాపు ఇలియానా నటించిన తెలుగు సినిమాలన్నీ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఇలియానా.. రెండోసారి ప్రేమలో పడినట్టు రూమర్స్ వినిపిసస్తున్నాయి.
ఇలియానా ముందుగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆండ్రూను ప్రేమించి కొన్ని బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా వదులుకుంది ఈ సైజ్ జీరో బ్యూటీ. దీంతో ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా 2019లో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. అప్పటినుండి ఇలియానా సినిమాలపై దృష్టిపెడుతూ సింగిల్‌గానే ఉంటుంది.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. బర్త్ డే పార్టీని మాల్దీవ్స్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు విక్కీ కౌశల్. ఈ పార్టీకి సినీ సెలబ్రిటీలు కాకుండా వారిద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఇందులో ఇలియానా కూడా మెరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కత్రినా సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్‌లో న్యూస్ వైరల్ అయ్యింది. ఈ వార్తలపై ఇప్పటివరకు ఇలియానా మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com