Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు.. నిందితురాలిగా బాలీవుడ్ బ్యూటీ..

Jacqueline Fernandez: కాన్‌మ్యాన్ సుకేశ్ చంద్రశేఖర్‌తో సన్నిహిత సంబంధాలు హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎక్కడాలేని తిప్పలు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే సుకేశ్ చంద్రశేఖర్ ఓ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన తర్వాత.. అదే కేసులో మరో నిందితురాలిగా జాక్వెలిన్‌ను అనుమానిస్తూ వచ్చింది ఈడీ. ఇప్పుడు అదే అనుమానం నిజమయినట్టు ఢీల్లీ కోర్టుకు సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తామని చెప్పి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు తీసుకున్నాడు సుకేశ్ చంద్రశేఖర్. కానీ ఆ తర్వాత బెయిల్ సంగతే మర్చిపోయాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఇదే విషయంపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సుకేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇక విచారణ చేపట్టిన తర్వాత ఇప్పటికీ ఈ కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు.
ఇదే మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల జాక్వెలిన్ కూడా ఇందులో భాగమని ఈడీ అనుమానిస్తూ వచ్చింది. ఈడీ విచారణలో జాక్వెలిన్.. సుకేశ్ నుండి పలు బహుమతులు పొందినట్టు నిర్ధారించింది. దీంతో ఈ నటికి చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు తాను కూడా ఓ నిందితురాలు అని నిర్ధారణ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com