Janhvi Kapoor: మా అమ్మ ఉండుంటే దీనికి సమాధానం చెప్పేదాన్ని: జాన్వీ

Janhvi Kapoor: మా అమ్మ ఉండుంటే దీనికి సమాధానం చెప్పేదాన్ని: జాన్వీ
Janhvi Kapoor: తాజాగా తన తల్లికి, తనకు ఉన్న పోలిక గురించి జాన్వీకి ఓ ప్రశ్న ఎదురయ్యింది.

Janhvi Kapoor: కేవలం సౌత్‌లోనే కాదు ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి అతిలోక సుందరిగా పేరు తెచ్చకుంది శ్రీదేవి. ఇక తన హఠాన్మరణం తన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో తన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల తన తల్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది జాన్వీ కపూర్.

శ్రీదేవికి తన ఇద్దరు కూతుళ్లు హీరోయిన్స్ అవ్వాలని ఉన్నా.. అది చూడకుండానే కన్నుమూసింది. అయినా కూడా జాన్వీ ఎక్కడికి వెళ్లినా.. శ్రీదేవి కూతురు అనే ముద్ర మాత్రం పోలేదు. అందువల్లే తన తల్లి గురించి ఎక్కువగా మాట్లాడడం మానేసింది. తన తల్లి గురించి మాట్లాడుతుంటే అందరూ తనకు గర్వం అనుకుంటున్నారని జాన్వీ ఇటీవల చెప్పుకొచ్చింది.


తాజాగా తన తల్లికి, తనకు ఉన్న పోలిక గురించి జాన్వీకి ఓ ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే అందరూ తనకు గర్వం అనుకుంటున్నారని తెలిపింది. అంతే కాకుండా తన తల్లి ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తాను సౌకర్యంగా ఫీల్ అయ్యేదాన్నని చెప్పింది. మా ఇద్దరికీ చాలా విషయాల్లో పోలిక ఉన్నా కూడా ఇప్పుడు నేను వాటిని చెప్పలేకపోతున్నానని వాపోయింది జాన్వీ కపూర్.

Tags

Read MoreRead Less
Next Story