Jawan Trailer : బట్టబుర్రతో అదరగోట్టేసాడు

Jawan Trailer : బట్టబుర్రతో అదరగోట్టేసాడు
జవాన్‌లో షారుఖ్‌ ఖాన్‌ వన్‌ మ్యాన్‌ షో

పఠాన్ జోష్ తో ఉన్న షారుఖ్ ఖాన్ జవాన్ తో ఆ దూకుడు కొనసాగించేలా కనిపిస్తున్నాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పలు ఫుటేజ్ వీడియోలు ఇటీవలే లీకై సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇక ఇప్పుడు రిలీజ్ అయిన దాని టీజర్ ప్రేక్షకులను వారి సీట్ల అంచున ఉంచేట్టు అనిపిస్తోంది. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ సన్నివేశాలతో అదుర్స్ అనిపిస్తోంది. ఎవరు నేను? ఎవరిని కాదు? అని షారుఖ్ వాయిస్ తో మొదలయ్యే ట్రైలర్ . నేను విలన్ అయితే, ఏ హీరో నా ముందు నిలబడలేడు అంటూ కింగ్ ఖాన్ సూపర్ యాక్షన్ తో అదరగొడుతుంది.




భారీ బడ్జెట్ తో, బీభత్సం అయిన అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఎనలేని బజ్ క్రియేట్ అయ్యింది. ఇది సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.




2 నిమిషాల 12 సెకన్ల ఈ మూవీ ట్రైలర్‌ చూసిన వారందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ కాసేపట్లోనే కింగ్ ఖాన్ షారూఖ్ తన సత్తా చూపించాడు. మెట్రో రైలు సీక్వెన్స్ సినిమాకు హైలైట్ కానుందని వీడియో ను చూస్తే తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ లుక్ చిత్రంపై అంచనాలను పెంచింది. అంతేకాదు, చివర్లో గుండుతో షారుఖ్ ఖాన్ తన అభిమానులకు షాకిచ్చాడు. ఓ ఓల్డ్ సాంగ్‌కు ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ విలనీ పండించాడు. దీపికా పదుకొనే, నయనతార, ప్రియమణి యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు.




ఇక ఈ మూవీ విడుదలయ్యాక ఇండియా బాక్సాఫీస్ రీకార్డ్స్ అన్నింటిని అధిగమిస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు నేను? ఎవర్ని కాను , అని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో షారుఖ్ ‘జవాన్‘ ట్రైలర్ ను షేర్ చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తమిళం మరియు తెలుగు వెర్షన్‌లలో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story