ఒక్క ముద్దు ప్లీజ్.. అభిమాని రిక్వెస్ట్..: జాన్వీ ఫన్నీ రిప్లై

ఒక్క ముద్దు ప్లీజ్.. అభిమాని రిక్వెస్ట్..: జాన్వీ ఫన్నీ రిప్లై
అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్.. అమ్మ అందచందాలను పుణికి పుచ్చుకున్న పుత్తడి బొమ్మ జాన్వి. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్.. అమ్మ అందచందాలను పుణికి పుచ్చుకున్న పుత్తడి బొమ్మ జాన్వి. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య అభిమానులతో సరదాగా ఓ చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పింది.

ఇండస్ట్రీలో మీ స్థానం ఏంటి అని అడిగితే.. నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నటిని. నాకు ఎలాంటి హోదాలు వద్దు. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ దాకా అందరికీ నచ్చేలా ప్రవర్తిస్తా.

ఓ అభిమాని మరి కాస్త ముందుకెళ్లి మనం కిస్ చేసుకుందామా అని అడిగితే. వద్దు.. అంత మంచిది కాదు అని మాస్క్ ధరించిన తన ఫోటో చూపించింది. ఇంత స్లిమ్‌‌గా, అందంగా ఉన్నారు ఏంటి మీ బ్యూటీ సీక్రెట్.. ఏం తింటారు అని అడిగితే.. ఏం తిన్నా తినకపోయినా రోజుకి నాలుగు స్పూన్లు ఐస్ క్రీం తింటాను (చేతిలో ఉన్న ఐస్ క్రీం కప్పుని చూపిస్తూ)

మానసిక ఒత్తిడినుంచి ఎలా తప్పించుకుంటారు.. దిండుని కౌగిలించుకుని కొన్ని విషాద గీతాలు పాడుకుంటా..

ఎక్కడికి వెళ్లినా కెమేరాలు వెంటపడుతుంటాయి కదా ఇబ్బంది అనిపించదా అంటే.. వాళ్లు మా ప్రచారం కల్పిస్తున్నారు. అయినా వాళ్ల వృత్తిని మనం గౌరవించాలి.

మీ ఫస్ట్ క్రిటిక్ ఎవరు.. మా చెల్లి ఖుషి.. తను ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెబుతుంది. సినిమాలైనా, వ్యక్తిగత విషయాలైనా.. అక్కనే కదా అని ఎప్పుడూ ఆకాశానికి ఎత్తదు.

మీ గురించి వచ్చే రూమర్లపై మీ కామెంట్.. మా ఫ్యామిలీ బాధ పడతారు. అయినా అలాంటి వాటిపై స్పందించకపోవడమే మంచిది.

Tags

Read MoreRead Less
Next Story