John Abraham: 'కేవలం అలా ప్రేక్షకులకు అందుబాటులో ఉండను.. నేను బిగ్ స్క్రీన్ హీరోని..'

John Abraham: కేవలం అలా ప్రేక్షకులకు అందుబాటులో ఉండను.. నేను బిగ్ స్క్రీన్ హీరోని..
John Abraham: బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయాడు.

John Abraham: ప్రస్తుతం భారతీయ ముఖ్య సినీ పరిశ్రమల్లో బాలీవుడ్ వెనుకంజలో ఉండడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. పైగా అక్కడ కూడా సౌత్ సినిమాలే సత్తా చాటుతుండడంతో బాలీవుడ్ స్టార్లు వారి కెపాసిటీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది హిందీ హీరోలు స్పందించారు. అయితే తొలిసారి ఓటీటీలో సినిమాను విడుదల చేయడంపై వినూత్నంగా స్పందించాడు ఓ హీరో.

బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయాడు. సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతూ ఇదివరకు తను చేసిన కామెంట్స్ మరవక ముందే మరోసారి తన హీరోయిజం గురించి జాన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తను హీరోగా నటించిన 'ఏక్ విలన్ రిటర్న్స్' మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న జాన్ అబ్రహం ఈ కామెంట్స్ చేశాడు.

ఒక నిర్మాతగా తాను ఓటీటీ ఆడియన్స్ కోసం సినిమాను తీస్తానని చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం. కానీ నటుడిగా మాత్రం వెండితెరపై కనిపించడానికి మాత్రమే ఇష్టపడతానని అన్నాడు. ప్రేక్షకులు నెలకు రూ.300, 400 కట్టి తనను చూడడం తనకు అస్సలు నచ్చదని సూటిగా చెప్పేశాడు. అంతే కాకుండా కేవలం రూ.300,400కు తను వారికి అందుబాటులో ఉండనని అన్నాడు జాన్. తాను బిగ్ స్క్రీన్ హీరో అని మరోసారి గుర్తుచేశాడు. ఇదిలా ఉండగా తను నటించిన 'ఏక్ విలన్ రిటర్న్స్' జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story