Kajol: కాజోల్ డిమాండ్‌కు నిర్మాతలు షాక్.. ఒక్క ఎపిసోడ్‌కే అన్ని కోట్లా..!
Kajol: ప్రస్తుతం సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరూ ఓటీటీ వెబ్ సిరీస్‌లవైపు మొగ్గుచూపుతున్నారు. ఓటీటీ కంటెంట్ వల్ల ఎక్కువమంది ప్రేక్షకులకు దగ్గరవ్వచ్చు అన్న ఉద్దేశ్యంతో చాలామంది సీనియర్ నటీనటులు వెబ్ సిరీస్‌లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిల్ కాజోల్ కూడా తన డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయినట్టుగా తెలుస్తోంది. దీనికోసం తన రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
ఒకప్పుడు కుర్రకారును తన అందంతో, అభినయంతో అలరించిన కాజోల్.. పూర్తిగా సినిమాలకు దూరమవ్వలేదు.. అలా అని వరుసగా సినిమాలతో అలరించడం లేదు. తనకు నచ్చిన పాత్ర దొరికినప్పుడల్లా స్క్రీన్‌పై మెరవడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడాన్ని తగ్గించేసిన కాజోల్.. అప్పుడప్పుడు బుల్లితెరపై అలరించింది. తాజాగా డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాజోల్ హీరోయిన్‌గా త్వరలో ఓ థ్రిల్లర్ సిరీస్ తెరకెక్కనుంది. ఇప్పటికే సుస్మతా సేన్‌లాంటి సీనియర్ భామలు హాట్‌స్టార్‌తోనే డిజిటల్ డెబ్యూ చేశారు. ఇప్పుడు కాజోల్ కూడా ఆ జాబితాలో చేరనుంది. అయితే ఈ సిరీస్‌లో నటించడానికి ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు పారితోషికంగా తీసుకోనుందట కాజోల్. సినిమాకు అయిదు కోట్లు తీసుకుంటున్న వారి మధ్యలో కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్ ఒక ఎపిసోడ్‌కే అంత రెమ్యునరేషన్ తీసుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com