Kajol: 'రెండుసార్లు అబార్షన్.. అస్సలు సంతోషంగా లేను..' రివీల్ చేసిన నటి

Kajol: మామూలుగా హీరోయిన్లు పెళ్లి పేరుతో వారి కెరీర్‌ను రిస్క్‌లో పడేయాలని అనుకోరు. కానీ కొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తి దొరికితే కెరీర్‌తో పాటు పెళ్లిని కూడా మ్యానేజ్ చేయాలని అనుకుంటారు. అలా తన కెరీర్ మొదట్లోనే పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది కాజోల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన పాత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
కాజోల్, అజయ్ దేవగన్ 'హల్‌చల్' సినిమా సెట్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఫ్రెండ్స్ అయ్యి.. తర్వాత లవర్స్ అయ్యారు. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత కాజోల్‌కు హీరోయిన్‌గా చాలా డిమాండ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. దీనికి తన తండ్రి ఒప్పుకోకపోయినా.. కాజోల్ మొండిగా ఉండడంతో కొన్నాళ్లకు ఆయనే ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్‌గా కాజోల్, అజయ్ పెళ్లి జరిగిపోయింది.
పెళ్లి తర్వాత వెంటనే వారికి పిల్లలు కావాలి అనుకున్నా కూడా రెండుసార్లు మిస్ క్యారేజ్ అయిన విషయాన్ని కాజోల్ బయటపెట్టింది. కాజోల్ నటించిన 'కభీ ఖుషీ కభీ గమ్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నా కొన్నాళ్లకు మిస్ క్యారేజ్ అయిపోయింది. అందుకే ఆ సమయంలో తాను అస్సలు సంతోషంగా లేనని తెలిపింది కాజోల్. ప్రస్తుతం కాజోల్, అజయ్‌కు నైసా దేవగన్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com