Kamal R Khan : బ్రహ్మాస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్..

Kamal R Khan : బ్రహ్మాస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్..
X
Kamal R Khan : బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు

Kamal R Khan : బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. బ్రహ్మాస్త్ర చిత్రం ఓ పెద్ద డిజాస్టర్ అని ఆయన అన్నారు. ఆ మూవీని తాను రివ్యూ చేయనని ఎందుకంటే ప్రజలు బ్రహ్మాస్త్రను చూడడానికి థియేటర్లకు వెళ్లడం లేదన్నారు. అన్ని బాలీవుడ్ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అని ఆయన ట్వీట్ చేశారు. చిత్రాలు ఫ్లాప్ కాగానే కరణ్ జోహార్ తనను నిందిస్తాడని.. బ్రహ్మాస్త్ర విషయంలో అలా చేయననుకుంటున్నానని అన్నారు.

బాలీవుడ్ సినిమాలు తారలపై విమర్శిస్తూ కేఆర్కే ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటారు. బిగ్ బాస్ 3లో ఆయన పాల్గొన్నారు. బాలీవుడ్‌లో ఏ సినిమా రిలీజ్ అయితే నెటిజన్లు ఆయన కామెంట్ల కోసం ఎదురుచూస్తుంటారు. కేఆర్కే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నిటించనా అంతగా గుర్తింపు పొందలేదు.

Tags

Next Story