Kangana On Priyanka: ఆమెను బాలీవుడ్ నుంచి వెలేశారు...
దేశీగర్ల్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేస్తోన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా పేరుగడించిన పిగ్గీచాప్స్ ఈ మధ్య మీడియాతో ముచ్చటిస్తూ కీలక విషయాలు వెల్లడించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నుంచి అమ్మడు నిష్క్రమించిన వైనం గురించి తొలిసారి స్పందించింది. కొందరు తనకు అవకాశాలు రాకుండా చేస్తుండటం వల్లే ఇండస్ట్రీని వీడాల్సి వచ్చిందని పేర్కొంది. చెత్త రాజకీయాలతో విసిగిపోయి ఉన్న ఆమెకు హాలీవుడ్ నుంచి పిలుపు అందాగానే దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియాంక వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే లేవనెత్తుతున్నాయి. అయితే పీసీ మాటలపై కంగన రనౌత్ స్పందించింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సారధ్యంలోని బాలీవుడ్ మాఫియా ప్రియాంకను అనధికారిగా వెలి వేసిందని ట్వీట్ చేసింది. ప్రియాంకకు షారుఖ్ ఖాన్ తో సాన్నిహిత్యం ఉండటం వల్ల, బాలీవుడ్ మాఫియా అంతా కుమ్మక్కై ఆమెను దూరం పెట్టారని ఆరోపించింది. అందుకే ప్రియాంక ఇండస్ట్రీకి దూరమైందని వెల్లడించింది. కరణ్ జోహార్ అండ్ కో... ఇండస్ట్రీలో బయటవాళ్లని బతకనివ్వరు అనడానికి ఇదే ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com