Kangana Ranaut: పఠాన్ పై ప్రశంసలు... అంతలోనే...
ఎంతటి వారిపైనైనా మాటల తూటాలతో విరుచుకుపడే కంగనా కొంతకాలంగా కాస్త నిమ్మళంగా వ్యవహిరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అమ్మడి ట్విట్టర్ ఖాతా మళ్లీ పునరుద్ధరించడంతో తిరిగి తన నోటికి పని చెబుతుందనే భావించారు. అయితే, దీనికి భిన్నంగా ఆమె స్పందించిన తీరు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలే జరిగిన మర్జెన్సీ సినిమా ఫంక్షన్ లో మీడియాతో ముచ్చటించిన కంగనా, పఠాన్ చాలా బాగుందని, ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతే కాదు, హిందీ సినిమా వెనుకబడిపోయిందని, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టీ చేస్తున్న కృషి ఆమోదయోగ్యమని తెలిపింది.
అయితే కంగన ఏ ఉద్దేశంతో చెప్పినప్పటికీ, ఆమె నోటు వెంబడి ఖాన్స్ పై ప్రశంసలు కురవడం ఇదే తొలిసారి అని చెప్పాలి. బాలీవుడ్ బడా ఖాన్స్ పై చీటికీ మాటికీ చిందులు తొక్కే కంగన ఇలా పాజిటివ్ గా మాట్లాడటం నెటిజెన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రివర్స్ లో అమ్మడిపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. ఆమె ద్వంద వైఖరి అవలంభిస్తోందని, ప్రస్తుతం తన సినిమాలు ఆడటంలేదు కాబట్టి.. ఇండస్ట్రీలో కుదుటపడేందుకే ఇలా ఓ మెట్టు తగ్గి మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com