రిహానా కామెంట్స్‌పై కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్‌

రిహానా కామెంట్స్‌పై కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్‌
ఉద్యమం చేస్తున్నది రైతులు కాదని.. దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులంటూ ట్వీట్ చేశారు కంగన.

అంతకుముందు ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహానా సైతం భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై తన భావాలను పంచుకున్నారు. మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదంటూ రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని ట్వీట్‌ చేశారు. రిహానా ట్వీట్‌ చాలాసేపు ట్రెండ్‌ అవడం గమనార్హం. అనేక మంది రిహానా ట్వీట్‌కు స్పందించారు. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. మరికొందరు పూర్తిస్థాయి అవగాహన తర్వాత స్పందించాలని హితవు పలికారు.

రిహానా ట్వీట్‌పై ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదని.. దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులంటూ ట్వీట్ చేశారు. దేశాన్ని ముక్కలుముక్కలుగా చేసి చైనా కాలనీగా మార్చాలనుకుంటున్నారు. మీవల్లే మేము మా దేశాన్ని అమ్మాలనుకోవడం లేదు. అందుకే ఎవరూ మాట్లాడటం లేదు.. అంటూ రిహానాపై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అటు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం కొనసాగుతోంది. జనవరి 26న రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ ఉద్రిక్తంగా మారడంతో దీక్షా శిబిరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 6న మరోసారి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవల్ని రద్దు చేశారు పోలీసులు.


Tags

Read MoreRead Less
Next Story