Kangana Ranaut: 'ఏ బాలీవుడ్ స్టార్‌కు ఆ అర్హత లేదు'.. కంగన షాకింగ్ కామెంట్స్

Kangana Ranaut: బాలీవుడ్ కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్సే చేసింది. ప్రస్తుతం కంగన.. తన అప్‌కమింగ్ మూవీ ధాకడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా మే 20న విడుదల కానుండగా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది కంగన. ఇదే క్రమంలో తను బాలీవుడ్‌పై, బాలీవుడ్ స్టార్ హీరోలపై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీలో తనతో ఏ స్టార్ హీరో నటించడానికి ముందుకు రాడని కంగన ఇదివరకే స్టేట్‌మెంట్ ఇచ్చింది. మరోసారి 'ధాకడ్' ప్రమోషన్స్‌లో అదే మాటను బయటపెట్టింది. తనతో నటించడానికి ఇష్టపడకపోగా.. తనతో పనిచేసేవారిని కూడా బాలీవుడ్ స్టార్లు టార్గెట్ చేస్తారని చెప్పుకొచ్చింది కంగన. అందుకే తనతో ధాకడ్‌లో నటించిన అర్జున్ రాంపాల్‌ను ప్రశంసించింది.
అందుకే తనకు బాలీవుడ్ స్టార్లను కలవడం పెద్దగా నచ్చదు అని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది కంగనా రనౌత్. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు ఎవరికీ తన ఇంటికి వచ్చే అర్హత లేదంటూ తేల్చేసింది కంగన. ఇక కంగన చేసిన ఈ స్టేట్‌మెంట్స్‌ను విన్న బాలీవుడ్ ప్రేక్షకులు ఇదేమీ కొత్త కాదుగా అని పెద్దగా పట్టించుకోవడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com