The Dirty Picture Sequel: 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్‌ను రిజెక్ట్ చేసిన కంగనా.. ఎందుకంటే..?

The Dirty Picture Sequel: ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎన్నో బయోపిక్స్ రూపుదిద్దుకున్నాయి. అందులో కొన్ని స్ఫూర్తిదాయకంగా ఉంటే.. మరికొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేసేలా ఉన్నాయి. అలా కాంట్రవర్సీలకు దారితీసిన బయోపిక్స్‌లో ఒకటి 'ది డర్టీ పిక్చర్'. ఒకప్పటి ఐటెమ్ డ్యాన్సర్ సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదం సృష్టించింది. ఇప్పుడు అలాంటి కాంట్రవర్షియల్ బయోపిక్‌కు సీక్వెల్ రావడానికి సిద్ధమవుతోంది.
2011లో మిలాన్ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కింది డర్టీ పిక్చర్. ఈ సినిమాను లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మించారు. సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు ఈ సినిమా విడుదల కాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. దీంతో మూవీ టీమ్ ఎన్నో సన్నివేశాలను తొలగించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇన్నాళ్ల తర్వాత ఏక్తా కపూర్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచనతో హీరోయిన్‌గా కంగనా రనౌత్‌ను సంప్రదించిందట.
డర్టీ పిక్చర్ చిత్రంలో విద్యాబాలన్.. సిల్క్ పాత్రకు ప్రాణం పోసింది. అయితే సీక్వెల్‌లో మాత్రం తాను నటించనని చెప్పేసిందట. అందుకే మూవీ టీమ్ కంగనాను సంప్రదించగా.. తనకు ఉన్న ఒక విధమైన ఇమేజ్‌ను పోగొట్టుకోవడానికి కంగనా ఇష్టపడలేదట. అయితే కృతి సనన్, తాప్సీలాంటి వారు నటించడానికి ఒప్పుకున్నా ఏక్తా కపూర్ మాత్రం కథ పూర్తయ్యేవరకు వారిని వేచి ఉండమని చెప్పిందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com