బ్రిటన్ పార్లమెంట్ లో కరణ్ కు సత్కారం

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. 25 సంవత్సరాలుగా బాలీవుడ్ కు ఆయన చేస్తున్న సేవలకుగాను గుర్తించినట్లు పేర్కొంది. కరణ్ జోహార్ కు సినీ ఇండస్ట్రీలో అసాధారణ విజయాలు చేజిక్కాయని, ప్రపంచ చలనచిత్ర ల్యాండ్ స్కేప్ పై గణనీయమైన ప్రభావాన్ని కనబరిచారని యూకే పార్లమెంట్ తెలిపింది. ఇందుకుగాను కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
UK పార్లమెంట్ లోని హౌజ్ ఆఫ్ కామర్స్, హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభలకు సమావేశ స్థలంగా పరిగనించే వెస్ట్ వినిస్టర్ ప్యాలెస్ లో కరణ్ జోహార్ కు ప్రశంసా పత్రాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కరణ్. మొదటి ఫొటోలో అతను అందుకున్న లెటర్ యొక్క ఫొటోను పట్టుకుని కనిపించాడు. ఆపై మరో చిత్రంలో లండన్ పార్లమెంట్ వెలుపల ప్రశంసా పత్రంతో ఫోజిచ్చాడు.
"ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. లండన్ లోని బ్రిటిష్ హౌజ్ ఆఫ్ పార్లమెంట్ లో లీసెస్టర్ కు చెందిన గౌరవ. బోరోనెస్ వర్మచే గౌరవించబడటం నా అదృష్టం. నేను చిత్రసీమలో 25వ సంవత్సరాన్ని విజయవంతంగా గడుపుతున్నందుకు సంతోషిస్తున్నాను. నా కలలు నిజమైన రోజులలో ఇది ఒకటి, ఈ ప్రయాణంలో మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు" అని కరణ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com