Kareena Kapoor : కరీనాకి కరోనా.. టెన్షన్ లో బాలీవుడ్

Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కరీనా కపూర్. అమృతా అరోరాలకు కరోనా సోకింది.. తాజాగా వీరికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. అయితే వీరిద్దరూ గతకొద్దిరోజులుగా వరుసగా పార్టీలకి అటెండ్ అవుతున్నారు. గతవారం ముంబైలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్ నిర్వహించిన పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు కరోనా రూల్స్ అతిక్రమించి పార్టీలకి హాజరవ్వడం పట్ల BMC (బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఆగ్రహం వ్యక్తం చేసింది.. వీరితో టచ్ లో ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. కోవిడ్ బారిన పడిన వీరిద్దరూ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.ఇద్దరు స్టార్ హీరోయిన్ లకి కరోనా సోకడంతో బాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది. కాగా అటు మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఏకంగా పద్దెనిమిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడి ప్రభుత్వం అలెర్ట్ అయింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com