Kareena Kapoor: ఆ సినిమా కోసం రూ.12 కోట్ల రెమ్యునరేషన్.. స్పందించిన నటి..

Kareena Kapoor: ఆ సినిమా కోసం రూ.12 కోట్ల రెమ్యునరేషన్.. స్పందించిన నటి..
Kareena Kapoor: అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాలో హీరోయిన్‌గా చేసిన కరీనా.. ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది.

Kareena Kapoor: పెళ్లయితే సినీ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడుతుంది అనేది బాలీవుడ్‌కు వర్తించదు. పెళ్లి తర్వాత కూడా అక్కడ హీరోయిన్లు సినిమాలతో బిజీగానే ఉంటారు. ఇప్పుడిప్పుడే సౌత్ హీరోయిన్లు కూడా ఇలాగే బిజీ అవుతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టేవరకు ఫ్యామిలీ ఉమెన్‌గా ఉన్న కరీనా.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 'లాల్ సింగ్ చడ్డా' తో గ్రాండ్‌గా ప్రారంభించనుంది.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాలో హీరోయిన్‌గా చేసిన కరీనా.. ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఆగస్ట్ 11న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇక దీని తర్వాత కరీనా ఏ సినిమాలను సైన్ చేసినట్టుగా లేదు. కానీ టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించనున్న 'సీత' చిత్రంలో లీడ్ రోల్ చేయడానికి కరీనాను సంప్రదించినట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి.


రామాయణంలో సీత పాత్ర ఆధారంగా కేవలం 'సీత' అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి విజయేంద్ర ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కుడా విడుదలయ్యింది. అయితే ఇందులో హీరోయిన్‌గా కరీనాను సంప్రదించారని.. దానికోసం తాను రూ.12 కోట్లు కూడా డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై కరీనా.. లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో స్పందించింది.

ఆ సినిమాలో తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేసింది కరీనా. ఆ పాత్రకు తనను అనుకోనప్పుడు రెమ్యునరేషన్ ఎలా అడుగుతానంటూ ప్రశ్నించింది. ఇటువంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. మా పని మేము చేసుకోవాలా? లేదా ఇలాంటి వార్తలకు సమాధానాలిచ్చుకుంటూ కూర్చోవాలా? అనిపిస్తుంటుంది అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది కరీనా కపూర్



Tags

Read MoreRead Less
Next Story