Kareena Kapoor: కరీనా మళ్లీ ప్రెగ్నెంట్..! పోస్ట్‌తో క్లారిటీ..

Kareena Kapoor: బాలీవుడ్‌లో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా, తల్లిగా మారిన వారి కెరీర్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. అందుకే అక్కడి హీరోయిన్లు వారికి నచ్చినప్పుడు పెళ్లి చేసుకొని, కెరీర్‌ను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కరీనా కపూర్. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఇప్పటికీ కరీనా కపూర్ చాలామందికి క్రష్. ఇటీవల కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అన్న వార్త బాలీవుడ్‌లో వైరల్ అవ్వగా కరీనా వీటిపై ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.
కరీనా కపూర్ తన సహ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా కరీనా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ఇప్పటికీ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ఇక తాజాగా కరీనా.. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఓ ఫోటోలో తను మళ్లీ ప్రెగ్నెంట్ అయినట్టుగా కనిపిస్తుందని బాలీవుడ్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది.
తను మళ్లీ ప్రెగ్నెంట్ అన్న వార్తలపై ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది కరీనా. 'అది పాస్తా, వైన్ వల్లే. శాంతించండి. నేను ప్రెగ్నెంట్ కాదు. సైఫ్ ఇప్పటికే మన దేశ జనాభాను పెంచడానికి తగినంత సాయం చేశానని అంటుంటాడు. ఎంజాయ్' అంటూ ఒక్క పోస్ట్‌తో తను ప్రెగ్నెంట్ కాదని తేల్చేసింది కరీనా కపూర్. ఇక కరీనా నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com