బాలీవుడ్

Kartik Aaryan: ఇండియాలోనే మొదటి కారు.. గిఫ్ట్‌గా అందుకున్న బాలీవుడ్ హీరో..

Kartik Aaryan: చాలాకాలం సీనియర్ హీరోలు కూడా సాధించలేని కలెక్షన్లను కార్తిక్ ఆర్యన్ సాధించి చూపించాడు.

Kartik Aaryan: ఇండియాలోనే మొదటి కారు.. గిఫ్ట్‌గా అందుకున్న బాలీవుడ్ హీరో..
X

Kartik Aaryan: బాలీవుడ్ పరిశ్రమపై ఈ మధ్య ట్రోల్స్ చాలా ఎక్కువయ్యాయి. దానికి కారణం హిందీ సినిమాలు.. సౌత్ సినిమాల తాకిడిని తట్టుకోలేక వెనుదిరగడమే. కోవిడ్ తర్వాత కోట్లలో కలెక్షన్లు కొల్లగొట్టిన హిందీ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ సౌత్ సినిమాలు మాత్రం పాన్ ఇండియా రేంజ్‌లో మెప్పు పొందాయి. కానీ చాలాకాలం తర్వాత బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.

కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం 'భూల్ భులాయా 2'. 2007లో విడుదలయిన భూల్ భూలాయాకు ఇది సీక్వెల్. పూర్తిస్థాయి హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు పాజిటివ్ రివ్యూలు కూడా సాధించింది. దీంతో చాలాకాలం సీనియర్ హీరోలు కూడా సాధించలేని కలెక్షన్లను కార్తిక్ ఆర్యన్ సాధించి చూపించాడు. దీంతో మూవీ టీమ్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు.

తాజాగా భూల్ భులాయా 2 దర్శకుడు భూషణ్ కుమార్.. సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా కార్తిక్ ఆర్యన్‌కు ఓ కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. మెక్‌లారెన్‌ జీటీ అనే ఈ మోడల్ కారుకు ఇండియాలో మొదటి ఓనర్ అయ్యింది కార్తిక్ ఆర్యనే. ఈ విషయాన్ని కార్తిక్ ఆర్యన్ స్వయంగా తన ట్విటర్‌లో పోస్ట్ చేసి, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

'చైనీస్ తినడానికి నాకు కొత్త టేబుల్ దొరికింది. కష్టానికి ప్రతిఫలం తియ్యగా ఉంటుందని తెలుసు.. కానీ ఇంత పెద్దగా ఉంటుందని మాత్రం తెలియదు. ఇండియాలో మొదటి మెక్‌లారెన్‌ జీటీ. తరువాత గిఫ్ట్ ప్రైవేట్ జెట్ సార్' అంటూ కారుతో, దర్శకుడు భూషణ్ కుమార్‌తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కార్తిక్ ఆర్యన్.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES