Kashmir Files: జీవితాంతం అబద్ధాలే చెప్పుకుని బతికేయ్....!

కశ్మీర్ ఫైల్స్ ఓ పిచ్చి సినిమా అంటూ కొంతకాలం క్రితం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మండి పడ్డారు. కొంత మంది జీవితాంతం అబద్ధాలే చెప్పుకుని బదికేస్తారంటూ ఎద్దేవా చేశారు. మరికొంత మంది జీవితాంతం నిజాలే చెబుతారని, తాను ఆ కోవకు చెందినవాడినేనని ఇటీవలే ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. జీవితాంతం అబద్ధాలు చెప్పుకుంటూ బతకాలా లేక నిర్భయంగా నిజం చెబుతూనే జీవించాలా అన్నది వారి వారి ఇష్టా అయిష్టాలపై ఆధారపడి ఉందని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఇటీవలే కేరళ లిటరరీ ఫెస్టివల్ కు హాజరైన ప్రకాశ్ రాజ్ కశ్మీర్ ఫైల్స్ పనికిమాలిన సినిమా అంటూ మండి పడ్డారు. అంతర్జాతీయ జ్యూరీ సైతం ఈ సినిమాపై ఉమ్మివేసిందని, అయినా డైరెక్టర్ సిగ్గు లేకుండా తనకు ఆస్కార్ ఎందుకు రాలేదని అడుగుతున్నాడని దుయ్యబెట్టారు. అతనికి ఆస్కార్ కాదు కదా, కనీసం బాస్కర్ అవార్డ్ కూడా రాదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com