మరో పదేళ్ళలో ప్రియాంక తన భర్త నుంచి విడిపోతుంది... జోస్యం చెప్పిన కమల్..!
పెళ్ళిళ్ళు చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్ళుకి విడాకులు తీసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. ఇంకా బాలీవుడ్ లో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హృతిక్ రోషన్, ఆమీర్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్.. ఇలా ఎంతోమంది విడాకుల తీసుకున్నవాళ్ళే. అడ్జస్ట్ అయిపోయి కలిసుండడం కంటే విడిపోయి ఎవరి దారిలో వారి బ్రతికేయడం బెటర్ అనేది వాళ్ళ సిద్ధాంతం.
ఇదిలా ఉంటే రాబోయే పదేళ్ళలో ప్రియాంక చోప్రా కూడా ఇదే రూట్‌లో నడుస్తుందంటున్నాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. 'ప్రియాంకకు ఆమె భర్త నిక్ జోనస్ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం' అంటూ ఓ ట్వీట్ వదిలాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆయన పైన ఫైర్ అయ్యారు. నీకసలు బుద్దుందా.. మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు. వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక బాలీవుడ్‌లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని కమల్ ఆర్ ఖాన్ జోస్యం పలికాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం వెల్లడించలేదు.
Prediction 03- Nick Jonas will divorce #PriyankaChopra within next 10 years!
— KRK (@kamaalrkhan) July 10, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com