Salman Khan: సల్మాన్‌పై మరో సౌత్ డైరెక్టర్ కన్ను.. మైత్రీ నిర్మాణంలో..

Salman Khan: సల్మాన్‌పై మరో సౌత్ డైరెక్టర్ కన్ను.. మైత్రీ నిర్మాణంలో..
Salman Khan: ప్రస్తుతం సౌత్ డైరెక్టర్లంతా భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

Salman Khan: ప్రస్తుతం సౌత్ డైరెక్టర్లంతా భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్లు చాలామంది బాలీవుడ్‌లో డెబ్యూ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రీమేక్ సినిమాలతో కొందరు సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్‌లో సెటిల్ అవ్వగా.. మరికొందరు కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు. ఇక చాలావరకు సౌత్ దర్శకుల కన్ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఉన్నట్టు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ కాల్ షీట్స్ ఎప్పుడూ పెద్దగా ఖాళీగా ఉండవు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ అయిపోయి ఉంటాయి. అందుకే ఇప్పటివరకు ఎందరో సౌత్ దర్శకులను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు సల్మాన్. ప్రస్తుతం షారుక్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న అట్లీ కూడా సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఎదురుచూస్తూ ఉన్నాడు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో డైరెక్టర్ యాడ్ అయినట్టు సమాచారం.

లోకేశ్ కనకరాజ్.. 'విక్రమ్' సినిమాతో కోలీవుడ్‌లో ఓ కొత్త తరహా జోనర్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ మూవీ సక్సెస్‌తో ఎంతోమంది హీరోలు లోకేశ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండగా.. తను మాత్రం సల్మాన్ ఖాన్‌తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తన సినిమా 'మాస్టర్' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో డెబ్యూ చేయాల్సిన లోకేశ్.. పలు కారణాల వల్ల చేయలేకపోయాడు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఇప్పటికైనా సల్మా్న్‌తో సినిమా ఓకే చేయించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట లోకేశ్.

Tags

Read MoreRead Less
Next Story