Mallika Sherawat: 'దీపికా ఇప్పుడు చేసింది.. నేను 15 ఏళ్ల క్రితమే చేశాను'
![Mallika Sherawat: దీపికా ఇప్పుడు చేసింది.. నేను 15 ఏళ్ల క్రితమే చేశాను Mallika Sherawat: దీపికా ఇప్పుడు చేసింది.. నేను 15 ఏళ్ల క్రితమే చేశాను](https://www.tv5news.in/h-upload/2022/07/14/752246-deepika.webp)
Mallika Sherawat: పెళ్లి తర్వాత హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‌లో నటించకూడదని, ఎక్స్‌పోజింగ్ చేయకూడదని కొందరు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఒకవేళ పెళ్లయిన హీరోయిన్స్ అలా చేస్తే ఇక వారిపై వచ్చే నెగిటివిటీ మామూలుగా ఉండదు. ఇటీవల అలాంటి నెగిటివ్ కామెంట్స్‌నే ఎదుర్కుంది దీపికా పదుకొనె. దీనిపై బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందించారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దీపికా పదుకొనె కొన్నిరోజుల క్రితం అమెజాన్ ఒరిజినల్ మూవీ 'గెహ్రియాన్'లో నటించింది. ఇందులో యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో లిప్ లాక్ సీన్స్‌తో పాటు పలు ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది దీపికా. దీంతో తనపై ట్రోలింగ్ మొదలయ్యింది. పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి సీన్స్‌లో నటించడమేంటి అని చాలామంది విమర్శించడం మొదలుపెట్టారు. కానీ ఎవరు ఎంత విమర్శించినా దీపికా, రణవీర్ మాత్రం ఆ నెగిటివ్ కామెంట్స్‌కు పెద్దగా స్పందించలేదు.
బాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్నో బోల్డ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మల్లికా షెరావత్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా గెహ్రియాన్ గురించి తాను స్పందించింది. దీపికా ఇప్పుడు చేసినదాన్ని తాను 15 ఏళ్ల క్రితమే చేశానంటూ చెప్పుకొచ్చింది. 'మర్డర్' సినిమాలో నటించినప్పుడు కూడా తనకు ఇలాంటిదే ఎదురయ్యిందని చెప్పింది.
అప్పటికి ప్రేక్షకులు ఇంత విశాలంగా ఆలోచించేవారు కాదని తెలిపింది మల్లికా. బోల్డ్‌గా చేయడం వల్ల చాలావరకు ప్రేక్షకులు, మీడియా.. తనను మానసికంగా హింసించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను యాక్టర్‌గా మంచి పాత్రలు చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, కానీ బోల్డ్ సినిమాలు చేసినప్పుడు మాత్రం విమర్శించారని అప్పటి విషయాలను గుర్తుచేసుకుంది మల్లికా షెరావత్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com