ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన మరాఠి నటి

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న బాక్సర్ ప్రదీప్ ఖరేరా(25) మరాఠి నటి మానసి నాయక్‌ను వివాహమాడాడు. మహరాష్ట్రీయుల సంప్రదాయం ప్రకారం, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. గులాబీ రంగు లెహంగాలో వధువు మానసి నాయక్ కనిపించగా, వరుడు ప్రదీప్ షేర్వాణీ ధరించి హుందాగా కనిపించాడు. వీరికి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. పెళ్లి చేసుకోనున్నట్లుగా మానసి- ప్రదీప్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. అటు బాక్సర్‌గా గుర్తింపు పొందిన ప్రదీప్ ఖారారే.. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిలింగ్ ఏషియన్ టైటిల్ సాధించి సత్తాచాటాడు. ఇక మానసి విషయానికి వచ్చేసరికి జబర్దస్త్, తూక్యా తుక్‌విలా నగ్యా నచ్‌విలా వంటి సినిమాలతో పాటుగా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. కాగా ప్రదీప్- మానసి కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com