బీజేపీలో చేరిన నటుడు మిథున్‌ చక్రవర్తి..!

బీజేపీలో చేరిన నటుడు మిథున్‌ చక్రవర్తి..!
X
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు.

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. బీజేపీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన మిథున్‌.. 2014 లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. అయితే పార్టీతో విబేధించి 2016 లో తన పదవికి రాజీనామా చేశారు.

Tags

Next Story