Janhvi Kapoor: 'తనకంటే ఎవరూ బెటర్‌గా చేయలేరు..' జాన్వీపై నయన్ ప్రశంసలు..

Janhvi Kapoor: తనకంటే ఎవరూ బెటర్‌గా చేయలేరు.. జాన్వీపై నయన్ ప్రశంసలు..
Janhvi Kapoor: ‘ధడక్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. సినిమాల్లోకి అడుగుపెట్టనప్పటి నుండి తనకంటూ ఓ సొంత గుర్తింపు కోసం కష్టపడుతూనే ఉంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ. ఇక త్వరలోనే 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ యంగ్ బ్యూటీ. ఇక ఇటీవల జాన్వీపై ప్రశంసల వర్షం కురిపించింది నయనతార.

'ధడక్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది. 'ఘోస్ట్ స్టోరీస్' అనే వెబ్ మూవీలో నటించింది. ఆ తర్వాత చేసిన 'గుంజన్ సక్సేనా' బయోపిక్ నటిగా జాన్వీకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇందులో ఓ ఫైటర్ పైలెట్‌గా నటించిన తను ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకోవడంలో సక్సెస్ అయ్యింది.

జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' జులై 29న నేరుగా హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా నయనతార నటించిన 'కొలమావు కోకిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. తన మూవీని జాన్వీ కపూర్ రీమేక్ చేయడంపై నయనతార స్పందించింది. 'కోకిల నా మనసుకు ఎంతో దగ్గరయ్యింది. ఇక గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ చూస్తుంటే నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రేక్షకులు ఓ ఫన్ చిత్రాన్ని చూడబోతున్నారు. తనకంటే జెర్రీగా ఎవరూ బెటర్ కాదు. గుడ్ లక్ జాన్వీ' అని తన విషెస్‌ను తెలిపింది నయనతార.

Tags

Read MoreRead Less
Next Story