Neetu Kapoor: ఆలియా ప్రెగ్నెన్సీపై రణబీర్ తల్లి నీతూ కపూర్ రియాక్షన్..
Neetu Kapoor: ఇటీవల షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్తున్న నీతూ కపూర్‌ను బాలీవుడ్ మీడియా పలకరించింది.

Neetu Kapoor: ఆలియా భట్, రణభీర్ కపూర్ పెళ్లి సింపుల్‌గా, సన్నిహితుల మధ్య జరిగిపోయింది. కానీ వారి పెళ్లి విషయాన్ని మాత్రం వారిద్దరూ దాచలేదు. పెళ్లి అవ్వగానే మీడియా ముందుకు వచ్చారు. అలాగే ఆలియా ప్రెగ్నెంట్ అని కూడా ఎక్కువరోజులు దాచకుండా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. తాజాగా రణభీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యింది.
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియ భట్, రణబీర్ కపూర్‌లు. నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్లిద్దరూ ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లైన వెంటనే ఎవరి షూటింగ్స్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. పెళ్లై 2,3 సంవత్సరాలైనా గ్యాప్ తీసుకోకుండా అప్పుడే మా జీవితంలోకి ఓ బేబీని ఆహ్వానిస్తున్నామంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయంపై నీతూ కపూర్ స్పందన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇటీవల షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్తున్న నీతూ కపూర్‌ను బాలీవుడ్ మీడియా పలకరించింది. తాను నాన్నమ్మ కాబోతున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. అయితే ఈ విషయం అప్పుడే అందరికీ తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోయింది నీతూ కపూర్. ఈ విషయాన్ని ఆలియా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుంది. ఈ విషయంపై తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది.
RELATED STORIES
Naga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..
11 Aug 2022 5:20 AM GMTPoorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
11 Aug 2022 2:12 AM GMTNaga Chaitanya: తన టాటూతో సామ్‌కు ఉన్న కనెక్షన్ అదేనట..! బయటపెట్టిన...
10 Aug 2022 8:31 AM GMTMahesh Babu: 'ప్రియమైన సూపర్ ఫ్యాన్స్‌కు'.. మహేశ్ బాబు ట్వీట్..
10 Aug 2022 1:33 AM GMTపదేళ్ల సినీ ప్రయాణం పూర్తి.. ధన్యవాదాలు తెలిపిన హారిక అండ్ హాసిని...
9 Aug 2022 4:15 PM GMTMahesh Babu: రాజమౌళితో సినిమాపై స్పందించిన మహేశ్..
9 Aug 2022 2:30 PM GMT