NTR: ఆ బాలీవుడ్ మూవీ కోసం రంగంలోకి దిగనున్న ఎన్‌టీఆర్..

NTR: బాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఎంత ఎక్కువ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినా.. ఎంత పెద్ద స్టార్ హీరో చిత్రమయినా.. ప్రేక్షకులు ఎందుకో చూడడానికి ఇష్టపడడం లేదు. సినిమా చూసి నెగిటివ్ రివ్యూ ఇవ్వడం గురించి పక్కన పెడితే.. అసలు సినిమా చూడక ముందే దాన్ని బాయ్‌కాట్ పేరుతో పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి మెరుగుపరచాలన్ని ఆలోచనతో ఓ పాన్ ఇండియా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమా హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ముఖ్యంగా ఈ మూవీ ఫోకస్ అంతా తెలుగు మార్కెట్‌పైనే ఉంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ లాంటి తారాగణంతో ఈ మూవీ నిండిపోయింది.
ఇప్పటికే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగమయ్యాడు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా ఎన్‌టీఆర్‌ను రంగంలోకి దించనుంది టీమ్. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్‌టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. మరి కనీసం బ్రహ్మాస్త్ర అయినా బాలీవుడ్ ఫేట్‌ను మారుస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com