OMG 2 Teaser date: రేపే టీజర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’. 2012లో వచ్చిన ఓ మై గాడ్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై కూడా బాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఆసక్తిని పెంచింది. టీజర్ కోసం ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు ప్రేక్షకులు. ఈ తరుణంలో టీజర్ గురించి అక్షర్ కుమార్ ప్రకటించాడు. ఓఎంజీ2 టీజర్ రిలీజ్ డేట్‍ను ఓ ప్రోమో వీడియోతో వెల్లడించాడు. సినిమాకు సంబంధించిన టీజర్ జూలై 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. . దీంతో పాటు చిన్న మూవీ గ్లింప్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ శివుడి వేషంలో ఉన్నాడు. నలుపు రంగు దుస్తులు ధరించి, పొడవైన జుట్టు, కళ్లకు కాటుక, నుదుటిపై నామాలతో అక్షయ్ ఈ వీడియోలో కనిపించాడు. శివుడి వేషధారణలో చాలా ఇంటెన్స్‌గా అనిపించాడు. బ్యాక్‍గ్రౌండ్‍లో ‘హర హర మహాదేవ్’ నినాదాలు మారుమోగాయి.
ఓఎంజీ ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కింది. వేరే భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ అయింది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్.
ఓఎంజీ 2 మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు పంజక్ త్రిపాఠి, యామీ గౌతమ్, అరుణ్ గోవిల్, గోవింద్ నమ్‍దేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా.. మంగేశ్ దక్డే సంగీతం అందిస్తున్నాడు.
అక్షయ్ పోస్ట్ చేసిన ప్రోమోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరో మాస్టర్ పీస్ మూవీ వచ్చేస్తోందంటూ సంతోషపడుతున్నారు. గత సారి కృష్ణుడి రూపంలో వచ్చిన దేవుడు ఈసారి శివడు రూపం లో వస్తాడని ఎదురు చూస్తున్నాం అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com