One Night Stand: నిజమేనని ఒప్పుకున్న స్టార్స్ వీరే....

బాలీవుడ్ నటులు ఏదో ఒక విధంగా వార్తలెక్కుతూనే ఉంటారు. ప్రేమ,పెళ్లి, విడాకులు లేదా వివాహేతర సంబంధాల విషయాల్లో ఏదొక కామెంట్ చేసి వైరల్ అవుతుంటారు. అయితే తాజాగా పలువురు హీరోలు వన్ నైట్ స్టాండ్ పట్ల వారి మనసులోని భావాలను, వారికున్న అనుభవాలను బయట పెట్టారు. రణ్ వీర్ సింగ్, ఇమ్రాన్ హష్మీ, ఆదిత్యారాయ్‌కపూర్ తో పాటూ షెర్లిన్ చోప్రా, సన్నీలియోన్ కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ ముచ్చటేంటో ఇప్పుడు చూద్దాం
తాజాగా కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొన్న రణ్ వీర్ సింగ్ తన వన్ నైట్ స్టాండ్ గురించి తెలిపి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇటీవలే ఆదిత్యరాయ్‌కపూర్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తనకు ఇలాంటివాటిపై పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అయితే ఆదిత్య ఈ మధ్య అనన్య పాండేతో డేటింగ్‌లో ఉన్నడన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఇమ్రాన్ హష్మీ విషయానికి వస్తే తన వన్‌నైట్ స్టాండ్ విషయం చెప్పి ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేశాడు. ఆ సంగతి ఎలా ఉన్నా... పర్వీన్ ను పెళ్లాడి ఒక బాబుకి తండ్రయ్యాడు. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా వన్‌నైట్‌స్టాండ్‌లో ట్రై చేశానని తెలిపింది. ఈ భామ ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లై వారి ఆలనా పాలనా చూసుకోవడమే కాకుండా ఎందరో అనాథలకు అమ్మైంది.
బాలీవుడ్ కమీడియన్ కృష్ణా అభిషేక్ ఏకంగా తాను తన భార్య కష్మీరా షా నే ఈ విధంగా కలుసుకున్నానంటూ చెప్పకొచ్చాడు. ఇప్పుడు వారు ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. బోల్డ్ నెస్ తో అందరి చూపులు తనవైపే తిప్పుకునే షెర్లిన్ చోప్రా కూడా బహిరంగంగా ఈ అంశంపై స్పందించింది. ఆ తరువాత అది కాస్త రిలేషన్‌షిప్‌కు దారి తీసిందని కూడా చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com