Oscars 2023: 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' పై ప్రియాంక ప్రశంసల జల్లు

Oscars 2023: ది ఎలిఫెంట్ విష్పరర్స్ పై ప్రియాంక ప్రశంసల జల్లు
ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైన డాక్యుమెంటరీ
ఆస్కార్ 2023 డాక్యుమెంటరీ విభాగంలో భారత్ తరఫున నామినేషన్ సంపాదించుకున్న లఘుచిత్రం 'ది ఎలిఫెంట్ విష్పరర్స్'. మరి కొద్ది రోజుల్లో ఆస్కార్ పురస్కారాలకు తెరలేస్తున్న సందర్భంలో ఈ డాక్యుమెంటరీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఐకాన్, అందాల నటి ప్రియాంకా చోప్రా ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తున్న ప్రియాంక ఎలిఫెంట్ విష్పరర్స్ బృందానికి ఆస్కార్ బరి నిలిచినందుకు గానూ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఇంత అద్భుతమైన కథకు ప్రాణం పోసినందుకు కార్తికీ గాన్సేవ్స్, గునీత్ మోంగాకు శుభాకాంక్షలు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story