OTT: 'ఆహా' లో 18పేజెస్‌....

జనవరి 27 విడుదల

కార్తికేయ-2 తరువాత నిఖిల్‌ హీరోగా అనుపమ హీరోయిన్‌గా త్రిల్లింగ్‌ ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ కథగా తెరకెక్కిన సినిమా 18 పేజెస్. సుకుమార్‌ రైటింగ్స్‌ నుంచి వెలువడిన ఈ కథకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తే గోపీ సుందర్‌ సంగీతం అందిచాడు.


బన్నీవాస్‌ నిర్మాత. గతేడాది డిసెంబర్‌ 23న వెండితెర పై విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందనే లభించింది. అయితే 18 పేజెస్‌ ను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. జనవరి27 "ఆహా"లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు 18పేజెస్‌ మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆహా విడుదల చేసింది.

Tags

Next Story