Pathan : ఓటీటీ రిలీజ్ కూ లైన్ క్లియర్...

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన 'పఠాన్' సినిమా మొదటి నుంచే వివాదాలకు కేంద్ర బిందువు అవుతూనే ఉంది. మరోవైపు జనవరి 25 న థియేటర్లలో విడుదల కానున్న సినిమా కోసం అభిమానులు మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా ఓటీటీ రీలిజ్ కు కూడా లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. పఠాన్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ప్రైజ్ కు సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ రిలీజ్ కు ఢిల్లీ హైకోర్డు కొన్ని షరత్తులు విధించిందని తెలుస్తోంది.
వినికిడి సమస్యలతో బాధపడేవారి కోసం హిందీలో సబ్ టైటిల్స్ తప్పనిసరిగా చేర్చాలని సూచించింది. ఓటీటీ రిలీజ్ కన్నా ముందు... మార్చి 10లోగా సెంట్రల్ బోర్డ్ నుంచి సినిమాకు రీ సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా ఆదేశించింది.
ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఓటీటీ లో విడుదల అవుతుండగా మార్చ్ 10వ తేది వరకు మళ్లీ సీబీసీ అనుమతి తీసుకోవాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com