Pathan Row: బేషరమ్ పాటే ఇష్టం: దీపికా
ఆ పాట కోసం చాలా కష్టపడ్డానంటూ చెప్పుకొచ్చిన దీపికా పదుకోణె

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహమ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా పఠాన్. బుధవారం విడుదల కానున్న ఈ సినిమా కాంట్రవర్సీకి కేంద్రబిందువుగా మారిన వైనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇందులోని బేషరమ్ పాటపై బీజేపీ, హీందూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. బేషరమ్ పాటలో దీపీకా కాషాయం రంగు దుస్తులు ధరించడం హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అభ్యంతరాలు వెల్లడంచారు.
మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ సినిమాలో చాలా అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమాని విడుదల చేయనివ్వమని కూడా అన్నారు. అయితే ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న దీపికా తాజాగా స్పందించింది. తనకు బేషరమ్ సాంగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంటూ చెప్పుకొచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో పఠాన్ సినిమాలో ఏ పాట ఇష్టమని అడగగా...బేషర్ పాటకే తన ఓటు అని చెప్పుకొచ్చింది. రెండు పాటలు రెండు రకాలుగా ఉంటాయని రెండు పాటలంటే తనకు ఇష్టమని తెలిపింది. రెండింటిలో ఏదో ఒకటే చెప్పాలంటే కష్టమని తెలిపింది. బేషరమ్ పాటకు చాలా కష్టపడ్డానని చెప్పిన దీపిక, షూట్ లొకేషన్ అత్యంత క్లిష్టంగా ఉందని పేర్కొంది. షారుఖ్‌తో డాన్స్ చేసేటప్పుడు అతనితో ఎక్కువ సమయం గడిపానని తెలిపింది. ఇద్దరూ మంచి డాన్సర్లే కావడంతో స్టెప్పులు విషయంలో ఇబ్బంది పడలేదని వెల్లడించింది.