Payal Rohatgi: 12 ఏళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్.. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ జంట..

Payal Rohatgi: మామూలుగా నిశ్చితార్థం తర్వాత వెంటనే పెళ్లి జరిగిపోవాలి అంటుంటారు. అందుకే ఎంగేజ్‌మెంట్ తర్వాత నెలరోజుల్లోనే పెళ్లి ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఓ బాలీవుడ్ జంటకు మాత్రం 2014లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. పెళ్లి మాత్రం ఈ ఏడాది జులైలో జరగనుంది. వారే పాయల్ రోహత్గి, సంగ్రమ్ సింగ్. తమ పెళ్లి విశేషాలను ఇటీవల సంగ్రమ్ సింగ్ బయటపెట్టాడు.
పరిచయమయిన కొన్నిరోజులకే ప్రేమలో పడిన పాయల్, సంగ్రమ్‌కు.. 2014 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అప్పటినుండి వీరు లవర్స్‌గానే ఉంటున్నారు. ఎందుకో ఆ తర్వాత ఈ జంట పెళ్లి గురించి ప్లాన్ చేసుకోలేదు. కానీ జులైలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నట్టు స్వయంగా సంగ్రమ్ ప్రకటించాడు. అంతే కాకుండా వారి డ్రీమ్ వెడ్డింగ్ గురించి కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అహ్మదాబాద్ లేదా ఉదయ్‌పూర్‌లో డ్రీమ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు సంగ్రమ్. పెళ్లికి ఫ్రెండ్స్‌ను ఎక్కువగా పిలవకపోయినా.. వారి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఉంటుంది అన్నాడు. ఇక తాజాగా లాకప్ అనే షోతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది పాయల్. అందులో ఒకప్పుడు కెరీర్ కోసం చేతబడి చేశానన్న సీక్రెట్‌ను అందరి ముందు రివీల్ చేసి షాకిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com